రఘువీర దెబ్బకు దిమ్మతిరిగిన దివాకర్
Published on: Fri Mar 9, 2012 8:39AM
అ
నంతపురం: అనంతపురం రాజకీయాల్లో మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డికి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షా పదవి విషయంలో రాష్ట్రమంత్రి రఘువీరారెడ్డి తన చిరకాల ప్రత్యర్ధి అయిన దివాకర్ రెడ్డికి ఝలక్ ఇచ్చారు. దివాకర్ రెడ్డి సూచించిన వ్యక్తికి కాక తన కనుసన్నల్లో మెలిగే మధుసూదన్ గుప్తాకు ఆ పదవిని ఇప్పించడంలో సక్సెస్ అయ్యారు. ఈ పరిణామం జెసి దివాకర్ రెడ్డికి దిగ్బ్రాంతిని కలిగించింది. డిసిసి అధ్యక్షా పదవిని తన సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డికి గాని లేదా తాను సూచించిన వ్యక్తికిగాని ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని పదేపదే కోరారు. తన సోదరుడికోసం ఢిల్లీ కూడా వెళ్లివచ్చారు. అధిష్టానంనుంచి గట్టి హామీ పొందలేక పోయినప్పటికీ దివాకర్ రెడ్డి ఎంతో కొంత ఆశాభావంతోనె ఉన్నారు. అయితే హఠాత్తుగా మధుసూదన్ గుప్తాను నియమించడంతో దివాకర్ రెడ్డి దిగ్బ్రాంతికి గురయ్యారు. జిల్లాలో దివాకర్ రెడ్డికి దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉంది. దీంతో ఆయన తరచుగా వైరాగ్యమ్లోకి వెళ్ళిపోతున్నారు.


