TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

'అనంత' దేశం టిక్కెట్టుకు పోటా పోటీ

Published on: Wed Mar 7, 2012 10:16AM

అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపై వేటువేయడంతో జిల్లాలోని అనంతపురం, రాయదుర్గం అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ రెండు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ టిక్కెట్ కోసం చాలామంది పోటీ పడుతున్నారు. అనంతపురం నియోజకవర్గంలో టిడిపి టిక్కెట్ కోసం ప్రభాకర్ చౌదరి, శ్రీనివాసులు, నదీమ్ పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ కోసం ఐఎన్ టియుసి జిల్లా అధ్యక్షుడు చవ్వా రాజశేఖరరెడ్డి, రాగే పరశురామ్, టిజె ప్రకాష్, కె.విజయభాస్కరరెడ్డి పోటీపడుతున్నారు. వీరంతా ఎవరికి వారు తమ స్థాయిలో టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనంతపురంలో తాజా మాజీ గుర్నాధరెడ్డి అభ్యర్ధిగా ఉంటారు. వామపక్షాలు కూడా ఇక్కడ బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో అనంతపురం నియోజకవర్గంలో బహుముఖ పోటీ అనివార్యంగా కనిపిస్తోంది.