అనంతలో అటకెక్కిన రాజీవ్ స్వగృహ
Published on: Tue Feb 21, 2012 10:42AM
అనంత
పురం: అనంతపురం జిల్లాలో రాజీవ్ స్వగృహ పనులు దాదాపు నిలిచిపోయాయి. 2007లో పథకాన్ని ప్రారంభించినా 2009 వరకు పనులు ప్రారంభం కాలేదు. 2010 మేలో జిల్లాలో రాజీవ్ స్వగృహ నిర్మాణాలు ప్రారంభించారు. దీనితో లబ్దిదారులు సంతోషించారు. అయితే ఈ సంతోషం ఎంతోకాలం నిలువలేదు. పనులన్నీ మధ్యలోనే ఆగిపోయాయి. టెండరుదారుల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణా లోపం కారణంగా ఈ దుస్థితి ఏర్పడింది. జిల్లాలోని గుంతకల్లు, హిందూపురం, కదిరి ప్రాంతాల్లో ఈ పథకం క్రింద ఇళ్ళ నిర్మాణానికి ఇప్పటికి స్థలం సేకరించలేదు. ప్రభుత్వం అధికారులు ఇళ్ళు కేటాయిస్తామంటూ ఒక్కో దరఖాస్తుదారుడి నుంచి సుమారు రూ.6వేల చొప్పున డబ్బు వసూలు చేశారు. అయితే ఈ ఇళ్ళు ఎంతకూ నిర్మాణంకాకపోవడం, నిర్మాణాలు నాణ్యంగా లేకపోవడంతో తమ డబ్బు వెనక్కి ఇవ్వాలని కొందరు లబ్దిదారులు డిమాండ్ చేసున్నారు.


