ఆందోళనకరంగా ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్యం...

 

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆనం వివేకానందరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు సమాచారం. ఆయన గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఊపిరితిత్తుల వ్యాధితో ఆనం బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, ఆయనకు వైద్యులు ప్రత్యేక వైద్యాన్ని అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న కిమ్స్ కు వచ్చి ఆయనను పరామర్శించారు. ఆనం ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణలు ఉన్నారు.