అన్ని వర్గాలకు నచ్చే బడ్జెట్: ఆనం
Published on: Fri Feb 10, 2012 10:48AM
తిరు
పతి : ఈ నెల 17న రాష్ట్ర బడ్జెట్ శాసనసభలో ప్రవేశపెడ్తామని అన్ని వర్గాలకు బడ్జెట్ ఆమోదయోగ్యంగా వుంటుందని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అన్నారు. మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యలను ఆయన వ్యతిరేకించారు. టిడిపితో సీఎం కుమ్మక్కయ్యారనటం శుద్ధ అబద్ధమన్నారు. సీపీఐ నారాయణ నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి విమానాశ్రయంలో మంత్రి శుక్రవారం మీడియాతో మాట్లాడారు.


