జగన్ ను రహస్యంగా కలిసిన ఆనం..!!
Published on: Sat Jul 7, 2018 6:24PM

నెల్లూరు రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆనం బ్రదర్స్, విభజన అనంతరం కాంగ్రెస్ ను వీడి టీడీపీ గూటికి చేరారు.. వివేకానంద రెడ్డి మరణం అనంతరం పరిణామాలు మారిపోయాయి.. కొంత కాలంగా రామనారాయణ రెడ్డి టీడీపీతో అసంతృప్తిగా ఉన్నారు.. వైసీపీలో చేరబోతున్నట్టు సంకేతాలు కూడా ఇచ్చారు.. దీంతో ఆనం, వైసీపీలో చేరడం ఖాయం, ఇక రేపో మాపో చేరతారని కూడా అనుకున్నారు.. కానీ ఆనం మళ్ళీ కొన్ని రోజులు సైలెంట్ అయ్యారు.. ఆనంతో బీజేపీ సంప్రదింపులు జరుపుతుందని వార్తలు వినిపించాయి.. మరోవైపు మేకపాటి గౌతమ్ రెడ్డి లాంటి నేతలు.. వైసీపీ పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తాం కానీ అందరికి సీట్లు సర్దుబాటు చేయలేము అని ఆనంని ఉద్దేశించి అన్నారు.. అయితే వీటన్నింటికి చెక్ పెడుతూ ఆనం వైసీపీలోనే చేరబోతున్నట్టు తెలుస్తోంది.. తాజాగా ఆనం జగన్ ని హైదరాబాద్ లో రహస్యంగా కలిసి, వైసీపీ లో చేరిక గురించి చర్చించారట.. దీంతో ఆనం, వైసీపీ తీర్థం పుచ్చుకోవడం తథ్యం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. చూద్దాం ఏం జరుగుతుందో.


