చంద్రబాబుపై ఆనం బ్రదర్స్ అలక.. వైసీపీలో చేరిక..!

 

నెల్లూరు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆనం సోదరులు వైసీపీ చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చలు వినిపిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఆనం వివేకా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయనను పరామర్శించేందుకు ఏపీ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్లగా... ఆయనను పరామర్శించేందుకు రావద్దని కూడా ఆనం సోదరులు చెప్పినట్టు సమాచారం. తమకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని కారణంగానే వారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే వారు వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.