TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కోవూరులో ఆనం నిర్ణయాలే కీలకం

Published on: Sat Mar 17, 2012 11:53AM

కొవూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఆనం సోదరుల నిర్ణయాలే కీలకంగా మారబోతున్నాయి. జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఈ సోదరులు గట్టిగా తలుచుకుంటే కాంగ్రెస్ అభ్యర్ధి ఇక్కడ గట్టి పోటీని ఇవ్వగలుగుతారు. అయితే ఇక్కడ పొరపాటున కాంగ్రెస్ అభ్యర్ధి గెలిస్తే ఆ క్రెడిట్ అంతా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పోతుందన్న భయాన్ని కూడా వీరు వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్ధికి మద్ధతుగా వీరు మనస్పూర్తిగా పనిచేయడం లేదన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. దీనికి తోడు కోవూరు సీటు టిడిపికి చెందింది కనుక కాంగ్రెస్ ఓడినా, గెలిచినా తమకు వచ్చే నష్టం ఏమీలేదని ఆనం వివేకానందరెడ్డి ప్రకటించడం కార్యకర్తలకు ఆగ్రహాన్ని కలిగించింది. అంతేకాకుండా సిఎంను వ్యతిరేకిస్తున్న మంత్రులతో ఈ సోదరులిద్దరూ చేతులు కలపడం విశేషం. కోవూరులో తమ వర్గానికి చెందిన ఓట్లు టిడిపికి మళ్ళించి ఆ పార్టీ అభ్యర్ధి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డికి సాయపడే ప్రయత్నాన్ని ఆనం సోదరులు చేస్తున్నారని వారి ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి, సోమిరెడ్డికి ఈ ఎన్నికలు అత్యంత కీలకం కావడంతో ఆయన ఆనం సోదరుల సహాయాన్ని అర్ధించినట్లు తెలిసింది.