TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గంటాకు కన్నా వార్నింగ్ ?

Published on: Mon Mar 19, 2012 12:24PM

విశాఖజిల్లాకు చెందిన రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావుకు సీనియర్ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది. పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనం అయిన తరువాత ఆ పార్టీకి చెందిన గంటా శ్రీనివాసరావుకు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పదవిని కట్టబెట్టింది. గంటా మంత్రి పదవి స్వీకరించిన నాటినుంచి జిల్లాకు చెందిన మరో సీనియర్ మంత్రి పసుపులేటి బాలరాజుకు అన్ని విషయాల్లో పోటీగా తయారయ్యారు. అధికారులు స్థానిక కాంగ్రెస్ నాయకుల్లో గంటా పట్టుపెంచుకుని బాలరాజును బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలరాజు ముఖ్యమంత్రికి అతి సన్నిహితుడైన మరో మంత్రి కన్నా లక్ష్మీనారాయణను కలుసుకుని తన బాధనంతా చెప్పుకున్నారు. దీంతో కన్నా కొద్దిరోజుల క్రితం గంటాతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతిని ఆయనకు వివరిస్తూ జిల్లాలో ఎప్పటినుంచి ఉన్న సీనియర్ మంత్రి బాలరాజును లెక్కచేయకపోతే భవిష్యత్తులో ఇబ్బందికర పరిష్టితులను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించినట్టు తెలిసింది.