పంజాబ్ సీఎం నిర్ణయం.. నేతలు షాక్...
Published on: Tue Mar 21, 2017 4:11PM

పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయానికి రాజకీయ నేతలకు కాస్త ఇబ్బందికరంగా అనిపించినా.. సామాన్య ప్రజలు మాత్రం ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటారా..? ఇకపై ఎమ్మల్యేలు, ఎంపీలకు బుగ్గకార్లు ఉండవంటూ ఆయన ప్రకటించారు. అంతే సీఎం తీసుకున్న ఈ నిర్ణయానికి నేతలు ఖంగుతిన్నారు. ఇకనుండి వీరి కార్లపై బుగ్గలు ఉండబోవని చెప్పారు. అమరీందర్ నిర్ణయాన్ని ప్రజలంతా హర్షిస్తుండగా.. అసలే బుగ్గకార్లలో తిరగడం ప్రస్టేజ్ గా ఫీలయ్యే నేతలు ఇదెక్కడి నిర్ణయంరా నాయనా అని బాధపడుతున్నారు. ఇదే సమయంలో ఎమ్మల్యేలు, ఎంపీలు మాత్రం ఇదెక్కడి నిర్ణయంరా నాయనా అని బాధపడుతున్నారు.


