అమ్రపాలిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్...

 

రిపబ్లిక్ డే ప్రసంగంలో వరంగల్ అర్బన్ కలెక్టర్ అమ్రపాలి వ్యవహరించిన తీరుపై ఇప్పటికే ఆమెపై పలువురు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ప్రసంగంలో పదే పదే నవ్వుతూ... ఐఏఎస్ హోదాలో ఉండి ఇలా చేయడం ఏంటని సర్వత్రా విమర్శలు తలెత్తాయి. ఇక దీనిపై తెలంగాణ ప్ర‌భుత్వం కూడా స్పందించింది. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎస్పీ సింగ్ స్వ‌యంగా ఆమెకు ఫోన్ చేసి ఈ విష‌యంపై మాట్లాడిన‌ట్టు తెలుస్తోంది. ఒక ఉన్న‌త‌మైన ప‌ద‌విలో ఉన్న‌ప్పుడు హుందాగా వ్య‌వ‌హ‌రించాల‌ని.. ఆమ్ర‌పాలిపై ఆయ‌న సీరియ‌స్ అయిన‌ట్టు స‌మాచారం. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూసుకుంటాన‌ని ఎస్పీసింగ్ తో ఆమ్ర‌పాలి అన్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.