TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీపీ ఆచార్యకు గుండెపోటు

Published on: Wed Feb 1, 2012 8:23AM

హైదరాబాద్‌ : ఎమ్మార్‌ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న బీపీ ఆచార్య గుండె నొప్పి రావడంతో హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ లో చేరారు. ప్రముఖ కార్డియాలజిస్టు శేషగిరిరావు ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేస్తున్నారు. కాగా బిపి ఆచార్య ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ఆయన ఆరోగ్యం సరిగా లేదని, గ్లూకోస్ ఎక్కించాల్సి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను మంగళవారం సాయంత్రం నిమ్స్‌లో చేర్పించాల్సి వచ్చింది. సిబిఐ ఆచార్యను తమ కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఐతే సీబీఐ అధికారులు మాత్రం ఆచార్య ఆరోగ్యం విషయంపై నోరు మెదపడం లేదు. ఈ రోజు ఉదయం ఆచార్య భార్య ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. అలా మాట్లాడుతున్న సమయంలోనే ఆచార్యకు గుండెనొప్పి వచ్చింది. దీంతో మధ్యాహ్నం ఆయనను ఆసుపత్రిలో చేర్చి ఫర్వాలేదన్న తర్వాత తిరిగి దిల్ కుషా హౌస్‌కు తరలించారు. అయితే సాయంత్రం మళ్లీ రావడంతో నిమ్స్ కు తరలించి ఐసీయూలో చికిత్స చేస్తున్నారు. అయితే  సీబీఐ కస్టడీలో ఉన్న బీపీ ఆచార్యకు నిమ్స్‌ కార్డియాలజీ డిపార్టుమెంటులో డాక్టర్‌ శేషగిరి రావు నేతృత్వంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిమ్స్‌ ఐసీయూలో ప్రత్యేక చికిత్స చేస్తున్నారు.