బీపీ ఆచార్యకు రెండు రోజుల కస్టడీ
Published on: Mon Jan 30, 2012 4:20PM
హైదరాబాద్ : ఎమ్మార్ కేసులో అరెస్టయిన సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యను సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు వరకు కోర్టులో హాజరుపర్చాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వ వాటాను 6 శాతానికి పడిపోవడానికి ప్రధాన కుట్రదారుడు ఆచార్యే అని సీబీఐ ఆరోపించింది. ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఆచార్య కొనసాగుతున్నారు.


