ఎమ్మార్ మాజీ సీఈవో అరెస్ట్
Published on: Sat Jan 28, 2012 3:51PM
హైదరాబాద్
: ఎమ్మార్ అక్రమాల్లో ఆ సంస్థ మాజీ సీఈవో విజయరాఘవన్ అరెస్ట్ అయ్యారు. దీంతో ఎమ్మార్ వ్యవహారంలో ఇది మూడో అరెస్ట్‌గా చెప్పవచ్చు. విజయరాఘవన్‌ను ఈ రోజు ఉదయం సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే ఎమ్మార్ అక్రమాలపై ఆయనను చాలా సార్లు సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో కోనేరుతో పాటు సునీల్‌రెడ్డిలు అరెస్ట్ అయ్యారు. రంగారావుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.


