TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బహిరంగ చర్చకు సై అన్న అంబటి

Published on: Tue Jan 10, 2012 9:05AM

హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో తనపై వచ్చిన అభియోగాలపై తాను బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియా ప్రతినిధుల సమావేశంలో తెలిపారు.తనపై వచ్చిన అభియోగాలపై అయన  తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పయ్వావుల కేశవ్‌కు సవాల్ విసిరారు.  పయ్యావుల కేశవ్ సవాల్‌ను ఎదుర్కునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. బహిరంగ చర్చకు ఎపిఐఐసి చైర్మన్ శివరామ సుబ్రహ్మణ్యం కూడా రావచ్చునని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మెప్పు పొంది తన పదవీ కాలాన్ని పొడగించుకోవడానికే శివరామ సుబ్రహ్మణ్యం తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు. తనపై అవాకులు చెవాకులు పేలితే ముఖ్యమంత్రి తన పదవీ కాలాన్ని పొడగిస్తారని శివరామ సుబ్రహ్మణ్యం అనుకుంటున్నారని ఆయన అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో తనకు వ్యతిరేకంగా ఆధారాలుంటే సిబిఐకి ఇచ్చుకోవచ్చునని ఆయన అన్నారు. సిబిఐకి తాను చెప్పాల్సింది చెప్పానని ఆయన అన్నారు.