అమిత్ షా, రామోజీరావు భేటీ..!!

 

దేశమంతటా కమలం వికసించేలా చేయాలని చూస్తున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, తాజాగా హైదరాబాద్ పర్యటనకు వచ్చారు.. ఈ సందర్బంగా అమిత్ షా పలువురు బీజేపీ నేతలను కలిసి వచ్చే ఎన్నికల వ్యూహాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది.. అలానే తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి తగు సూచనలు ఇచ్చినట్టు తెలుస్తోంది.. అయితే ఈ పర్యటనలో మరో విశేషం కూడా ఉంది.. బీజేపీ సర్కారు నాలుగేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న 'సంపర్క్ ఫర్ సమర్థన్' ప్రచార పర్వంలో భాగంగా అమిత్ షా.. రామోజీ రావు, సైనా నెహ్వాల్, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనిరాజును కలవనున్నారు.. అయితే అమిత్ షా, రామోజీ రావును కలవడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది..

ప్రస్తుతం బీజేపీ,టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.. మరి రామోజీ ఏమో చంద్రబాబుకి, టీడీపీకి అనుకూలమని అంటుంటారు.. అలాంటి రామోజీని అమిత్ షా కలవడం వెనక ఆంతర్యం ఏమిటి?.. పేరుకి సంపర్క్ ఫర్ సమర్థన్ అని చెప్పినప్పటికీ.. అమిత్ షా రామోజీతో ఒక గంట భేటీ అయ్యి రాజకీయాల గురించి చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. మొన్నటికి మొన్న నితిన్ గడ్కరీ పోలవరంను సందర్శించి చంద్రబాబు పనితీరు పట్ల సానుకూలంగా స్పందించారు, ఇప్పుడేమో అమిత్ షా రామోజీని కలవనుండటం.. ఇదంతా చూస్తుంటే బీజేపీ మళ్ళీ టీడీపీతో దోస్తీకి సిద్ధమని సంకేతాలు ఏమైనా ఇస్తుందా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తోన్నారు.. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో.