బీజేపీలోకి మాధురీ దీక్షిత్
Published on: Thu Jun 7, 2018 12:30PM

మీరు స్వచ్ఛ భారత్, అచ్ఛే దిన్, బేటీ బచావో బేటి పఢావో లాంటి నినాదాల గురించి వినే ఉంటారు. కానీ ‘సంపర్క్ కే సమర్థన్’ అన్న కార్యక్రమం గురించి ఎప్పుడన్నా విన్నారా! ఇక మీదట వింటారు. ఈ కార్యక్రమంలో 4 వేల మంది బీజేపీ కార్యకర్తలు లక్షమంది ప్రముఖులని కలిసి, తమ పార్టీకి మద్దతివ్వమని కోరతారు. ఇందులో భాగంగానే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అలనాటి అందాల తార మాధురీ దీక్షిత్, పారిశ్రామిక వేత్త రతన్ టాటాలను ముంబైలో కలుసుకుని వచ్చే ఎన్నికలలో వారి మద్దతుని కోరారు. మరి ఇప్పటివరకూ తటస్థంగా కనిపించిన మాధురీ, టాటాలు బీజేపీలో చేరతారా. కనీసం మద్దతిస్తారా. ఏమో!


