అమిత్ షా కు హోంశాఖ.. కిషన్ రెడ్డికి?
Published on: Fri May 31, 2019 2:31PM

మోదీ కేబినెట్‌లో మంత్రులకు శాఖలు కేటాయించారు. గత మంత్రి వర్గంలో రక్షణశాఖ మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్‌కు అత్యంత కీలకమైన ఆర్థికశాఖ అప్పగించారు. కొత్తగా మంత్రివర్గంలోకి చేరిన అమిత్ షాకు హోంశాఖ, రాజ్‌నాథ్‌సింగ్ కు రక్షణశాఖ, స్మృతి ఇరానీకి స్త్రీ- శిశు సంక్షేమ శాఖ, నితిన్ గడ్కరీకి రోడ్డు రవాణా, చిన్న మధ్యతరహా పరిశ్రమలు అప్పగించారు. అదేవిధంగా.. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డికి హోం శాఖ సహాయమంత్రి బాధ్యతలు అప్పగించారు.
గురువారం రాత్రి 57 మందితో కొత్త కేబినెట్ కొలువుదీరింది. ఇందులో 24 మందికి కేబినెట్, 9 మందికి స్వతంత్ర హోదా, 24 మందికి సహాయ మంత్రుల హోదా కల్పించారు. ఈ దఫా మంత్రివర్గంలో 20 మంది కొత్తవారికి అవకాశం లభించింది. ప్రజావినతులు, ఫించన్ల శాఖ, ఆటామిక్ ఎనర్జీ, స్పేస్ విభాగాలు శాఖలను ప్రధాని మోదీ తన వద్దే ఉంచుకున్నారు.


