భవిష్యత్తులో టీడీపీ తో పొత్తు ఉండొచ్చు!!

టీడీపీ ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలోని అంశాలను ఎన్డిఏ ప్రభత్వం అమలు చేయట్లేదని పొత్తు నుంచి దూరమయ్యి అవిశ్వాసం కూడా పెట్టిన సంగతి అందరికి తెలిసిందే.అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఓ జాతీయ వార్త పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టీడీపీ తో పొత్తు విషయమై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు."ప్రస్తుతం ఇది ముగిసిన అధ్యాయం.దీర్ఘ కాల పొత్తు వలన మేము చాలా నష్టపోయాం.ఇక భవిష్యత్తులో మేము పొత్తు పెట్టుకోదలుచుకోలేదు.కానీ భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు మాతో కలిసి పని చేస్తా అంటే మేము ఎప్పటికీ స్వాగతిస్తాం" అని తెలిపారు.

 

 

పార్లమెంట్ లో ఎన్డిఏ పై టీడీపీ అవిశ్వాసం అనంతరం అమిత్ షా మొదటిసారి ఈ విధంగా స్పందించారు.చంద్రబాబు విషయంలో బీజేపీ జాగ్రత్తగా నడుచుకుంటుంది.కేసులు తదితరాలతో చంద్రబాబు ని టార్గెట్ చేస్తే దానివల్ల టీడీపీ నే లాభపడుతుందని గ్రహించి తమ రాష్ట్ర నాయకుల ద్వారానే విమర్శనాస్త్రాలు గుప్పించనున్నారని తెలుస్తోంది.మోడీ ప్రభావం వల్లే టీడీపీ 2014 ఎన్నికల్లో గెలిచిందని,కానీ టీడీపీ బీజేపీ తో పొత్తు వల్ల మనం కోల్పోయింది కేవలం ముస్లిం వోటర్లనే అని ఎవరి ఉహాగానాల్లో వారు ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికైతే రెండు పార్టీ ఎవరికీ వారు స్వతంత్రంగానే పోటీ చేయనున్నారు.