TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మరోసారి బిజేపి అధ్యక్షుడిగా అమిత్ షా

Published on: Sun Jan 24, 2016 3:38PM


బిజేపి జాతీయ అధ్యక్షుడిగా అమిత్‌ షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇప్పటికే అధ్యక్షుడిగా ఉన్న ఆయన రెండోసారి కూడా ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా అమిత్‌ షా పేరును ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు కేంద్రమంత్రులు, బిజేపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిపాదించారు. అధ్యక్షుడిగా ఎన్నికైన అమిత్ షా కు పార్టీ నేతలు, కేంద్రమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఎన్నిక ద్వారా అమిత్‌ షా పూర్తిస్థాయిలో మరో మూడేళ్ల పాటు అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఈ ఎన్నికకు అగ్రనేతలు అడ్వాణి, మురళీ మనోహర్‌ జోషి దూరంగా ఉండటం కొసమెరుపు