ప్రతిపక్షాలు పిల్లులు, కుక్కలు, పాములా..!


మోడీకి భయపడి పిల్లులు, కుక్కలు, పాములు, ముంగిసలు ఒకటయ్యాయి... ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరనుకుంటున్నారా...? ఇంకెవరు మోడీ ప్రియ మిత్రుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఇక్కడ పిల్లులు, కుక్కలు, పాములు ఎవరో అర్దమయ్యే ఉంటది కదా. ప్రతిపక్ష పార్టీలపై అమిత్ షా ఎటకారంగా వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ముంబైలో జరిగిన బీజేపీ పార్టీ ఆవిర్భావ సభలో పాల్గొన్న ఆయన... ప్రతిపక్షాలపై దుమ్మెత్రిపోశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణగల నేత అని.. మోడీకి భయపడి ప్రతిపక్షపార్టీలన్నీ ఏకతాటి పైకి వచ్చాయని అన్నారు. అంతేకాదు...బీజేపీ కేవలం 10 మంది సభ్యులతో ప్రారంభమైంది.. ఇప్పుడు పదకొండు కోట్ల మంది బీజేపీకి ఉన్నారు.. ఇప్పుడున్నది బీజేపీ స్వర్ణయుగం కాదని.. పశ్చిమ బెంగాల్, ఓడిస్సా లో కూడా ప్రభుత్లం ఏర్పరిచినప్పుడే బీజేపీకి అసలైన స్వర్ణయుగం వచ్చినట్టుని అన్నారు.

 

ఇంక రాహుల్ గాంధీపై విరుచుకుపడుతూ ‘‘ఇటీవల మనం రెండు లోక్‌సభ స్థానాలను కోల్పోతే, రాహుల్ గాంధీ స్వీట్లు పంచారు. నేను చూసిన ఇలాంటి మొట్టమొదటి నేత ఆయనే’’ అన్నారు. నేడు బీజేపీ పాలనలో 20 రాష్ట్రాలు ఉన్నాయన్నారు. బీజేపీకి ఇది ఆనందించవలసిన విషయమని చెప్పారు.

 

ఇక ఇప్పుడే అసలు రచ్చ మొదలైంది. ఎంత మాత్రం సొంత మెజార్టీతో అధికారంలో ఉంటే మాత్రం ప్రతిపక్ష పార్టీలను పిల్లులు, కుక్కలతో పోల్చుతారని..దీంతో వారి అహంకారం మరోసారి బయటపడిందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విభజన హామీలు అమలుచేయకపోగా... పార్లమెంట్ సమావేశాల్లో  ఏ ఒక్క అంశాన్ని చర్చకు రానివ్వకుండా డ్రామాలు ఆడితే... ప్రభుత్వ తీరు నచ్చక ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పడం చేతకాక పారిపోయి ఇప్పుడు మమ్మల్ని పిల్లులు, కుక్కలు అంటూ మాట్లాడతారా అంటూ మండిపడుతున్నారు ప్రతిపక్ష పార్టీ నేతలు. మరి ఇప్పటికే సామాన్యులు మోడీ ప్రభుత్వంపై మండిపడుతుంటే.. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి మరింత వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నారు..