TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమిత్ షా గురించి ఓ ఆసక్తికరమైన అంశం

Published on: Mon Jun 4, 2018 10:53AM

 

ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా.... దేశ రాజకీయాలలో మోదీ తర్వాత అమిత్‌ షాదే ప్రధాన పాత్ర అని అందరికీ తెలుసు. అందుకనే ఒకోసారి చంద్రబాబు లాంటి నేతలు కూడా ఆయన మీద ఇంతెత్తున ఎగిరిపడుతుంటారు. సాధారణంలో లోక్‌సభ, రాజ్యసభలలో ఉండే పెద్దలు ఏదో ఒక పార్లమెంటరీ కమిటీలో సభ్యులుగా ఉండేందుకు అంగీకరిస్తారు. కానీ షా... తన రాజకీయాలకు సమయం సరిపోతుందో లేదో అన్న అనుమానంతోనో ఏమో ఒక్కటంటే ఒక్క కమిటీలో కూడా చేరలేదంట. ప్రస్తుతానికి ఉన్న 24 పార్లెమంటరీ కమిటీలన్నింటికీ షా దూరంగా ఉన్నారట. బిల్లును రూపొందించాలన్నా, వాటిని పాస్‌ చేయించాలన్నా ఈ కమిటీలదే కీలక బాధ్యత. మరి అమిత్‌ షా వారికి అంత బరువు బాధ్యతలను పట్టించుకునే సమయం ఎక్కడిది. పార్టీని బలోపేతం చేయాలి కదా!