చంద్రబాబు క్షమాపణ చెప్పాలి..!

 

తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం తిరుపతికి వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఏపీకి అన్యాయం చేసిన నేపథ్యంలో ఆయన రాకను నిరసిస్తూ నినాదాలు చేశారు. అంతేకాదు.. తిరుపతిలోని అలిపిరి వద్ద  అమిత్ షా కాన్వాయ్ పై టీడీపీ నేతలు, కార్యకర్తల రాళ్ల దాడి చేశారు. దీంతో ఇప్పుడు.. బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు తిరుపతిలోని నాలుగుకాళ్ల మంటపం వద్ద బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. అలిపిరి ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే క్షమాపణలు చెప్పాలని..ఘటనకు బాధ్యత వహిస్తూ హోం మంత్రి చినరాజప్ప తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దాడికి దిగిన టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలని నినాదాలు చేశారు.