దిగొచ్చిన కేంద్రం....చంద్రబాబుకు అమిత్ షా ఫోన్....

 

 

కేంద్ర బడ్జెట్ తరువాత ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎప్పుడు ఏం జరుగుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేంద్రం ఏపీకి చేసిన అన్యాయంపై టీడీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో టీడీపీ - బీజేపీ పొత్తుపై ఇక్కడే కాదు.. నేషనల్ మీడియాలో కూడా హడావిడి మొదలైంది. దీనికి తోడు  చంద్రబాబు, అనూహ్యంగా శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రేతో ఫోన్ లో మాట్లాడటంతో మరింత ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు చంద్రబాబు చేసిన పనికి బీజేపీ కూడా షాకైంది. చంద్రబాబు ఇంత దూకుడుగా వెళ్తారని ఊహించని బీజేపీ, ఈ పరిణామంతో అవాక్కయింది... వెంటనే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అమిత్ షా రంగంలోకి దిగారు.. చంద్రబాబుని బుజ్జగించే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. త్వరలోనే అన్ని విషయాలపై చర్చిద్దామని అమిత్‌షా అన్నారు... మీరు కోరినట్టే చేద్దాం అని, చర్చిద్దాం అని, తొందరపడవద్దు అంటూ, చంద్రబాబుని బుజ్జగించే ప్రయత్నం మొదలైంది. మొత్తానికి మొన్నటివరకూ గాల్లో తేలిన బీజేపీ ఇప్పుడు నేలకు దిగొచ్చిందన్నమాట...