అమిత్ షా వార్నింగ్.. టీడీపీ గురించి మాట్లాడొద్దు...


ఏపీ బీజేపీ నేతలకు ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది.  ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మరోసారి హరిబాబును కొనసాగించనున్నట్లు ప్రకటించారు. ఏపీ కార్యవర్గం నియమించుకోవాలని చెప్పారు. దీంతో రెండు వారాల్లో ఏపీ బీజేపీ కార్యవర్గం ప్రకటించే అవకాశం ఉంది. అంతేకాదు...  మిత్రపక్షం టీడీపీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని కూడా నేతలకు హెచ్చరికలు జారీ చేశారట. అలాగే, పార్టీలో గ్రూపులు ప్రోత్సహించవద్దని, పార్టీ విధానాలకు భిన్నంగా వెళితే చర్యలకు కూడా వెనుకాడనన్న అమిత్ షా హెచ్చరించారట. మొత్తానికి అమిత్ షాకు తెలిసిపోయినట్టుంది.. టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహంలో ఉన్నారని... ఏదైనా ఎక్కువ మాట్లాడితే వారితో తెగదెంపులు చేసుకుంటారని..