ఇరాక్ లో కుప్పకూలిన అమెరికా ఇంధన విమానం

posted on: Mar 13, 2026 9:16AM

అమెరికా లెక్క తప్పింది. ఇరాన్ ను రోజుల వ్యవధిలో వీలైతే గంటల వ్యవధిలో మట్టికరిపించి ఆధిపత్యం చెలాయిద్దామనుకున్న అగ్రరాజ్యనానికి ఇరాన్ చుక్కలు చూపిస్తున్నది. ఇరాన్ లక్ష్యంగా అమెరికా చేపట్టిేన ఆపరేషన్ ఎపిక్ ప్యూరీలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. యుద్ధవిమానాలకు గాలిలోనే ఇంధనం పింపే కేసీ-135 ట్యాంకర్ విమానం ఇరాక్ లో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న సిబ్బంది గల్లంతయ్యారు.

వారంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఇది కేవలం ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటన అని అమెరికా చెబుతోంది.   రెండు ఇంధన విమానాలు వెళ్లగా, వాటిలో ఒకటి సాంకేతిక కారణాలతో కూలిపోయిందనీ,  రెండో విమానం సురక్షితంగా బేస్‌కు తిరిగి వచ్చిందని తెలిపిన అమెరికా ఇది శత్రుదాడి కాదనీ కేవలం ప్రమాదం మాత్రమేననీ గట్టిగా చెప్పుకుంటోంది.  

ఇరాక్‌లోని ఎడారి ప్రాంతంలో విమాన శకలాలను గుర్తించేందుకు డ్రోన్లు, హెలికాప్టర్లను మోహరించారు.  సిబ్బంది ఆచూకీ తెలియరాలేదు. గత నెల చివరి వారం నుంచి  కొనసాగుతున్న ఈ యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ లో  తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే.  

google-ad-img
    Related Sigment News
    • Loading...