అమెరికాలో తుపాకీ మోత..నైట్ క్లబ్‌లో కాల్పులు
Published on: Sun Mar 26, 2017 1:24PM
.jpg)
అమెరికాలో మరోసారి తుపాకీలు గర్జించాయి. సిన్సినాటీలోని ఓ నైట్‌క్లబ్‌లో శనివారం అర్థరాత్రి కాల్పులు చోటు చేసుకున్నాయి. వారంతం కావడంతో యువతీ యువకులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు..ఆనందంతో కేరింతలు కొడుతున్న సమయంలో వారిపై ఓ సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారన్న సమాచారం తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు నైట్‌క్లబ్‌ను చుట్టుముట్టారు.


