మహిళలను వేధించినందుకు రెండు జన్మల శిక్ష..
Published on: Fri Jan 22, 2016 12:13PM

అది శిక్ష ...అలాంటి శిక్ష పడితేనే ..ఆడవారి మీద అకృత్యాలకి తెర పడేది ..అంటూ ఇప్పుడు సోషల్ మీడియా లో కొందరు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వారికి అంత నచ్చిన ఆ తీర్పు లో నేరస్తుడు ఓ పోలీస్ అధికారి. డ్యూటీ లో వుండగా మహిళలను లైంగికంగా వేధించాడని ఆరోపణ. అది రుజువు కావడంతో అతనికి శిక్ష విధించింది కోర్టు. ఇందులో చెప్పుకోతగ్గ విషయం ఏంటంటే 263 సంవత్సరాల జైలు శిక్ష వేసారు. అంటే రెండు జన్మలు ఎత్తినా తీరని శిక్ష అన్నమాట. పైగా తీర్పు మీదపై కోర్టుకు వెళ్ళే అనుమతి కూడా నిరాకరించారు. ఇదంతా అబివృద్ది చెందిన అమెరికాలో జరిగింది. అమెరికాలోని ఒక్లహామ నగరంలో విధులు నిర్వహించిన డేనియల్ హాల్ట్ క్లాక్ ఎందరో మహిళలను లైంగికంగా వేదించాడట. పోలీసు అధికారి విధులలో వుండి ఇలా చేయటాన్ని చాలా తీవ్రంగా పరిగణించింది కోర్టు. మహిళల మీద జరిగే అకృత్యాలు ఆగాలంటే శిక్షలు ఈ తరహాలో వుండాలి. అప్పుడే నేరస్తులు బయపడేది..నేరాలు అదుపులోకి వచ్చేది.


