TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఉత్తర కొరియాలో ఉండటానికి వీల్లేదు..

Published on: Sat Jul 22, 2017 12:42PM

 

గత కొద్దిరోజులుగా అమెరికాకు, ఉత్తర కొరియాకు మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అగ్రరాజ్యాలను సైతం లెక్కచేయకుండా ఉత్తరకొరియా క్షిపణలు ప్రయోగిస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్త‌ర కొరియాలో అమెరిక‌న్ల‌కు ర‌క్ష‌ణ లేద‌ని, అక్క‌డ నివ‌సిస్తున్న ప్ర‌వాస అమెరిక‌న్లంతా వెంట‌నే తిరిగి వ‌చ్చేయాల‌ని ఉత్త‌ర కొరియాలోని అమెరికా దౌత్య కేంద్రం ప్ర‌క‌టించింది. భ‌విష్య‌త్తులో కూడా అమెరిక‌న్లు ఉత్త‌ర కొరియా వెళ్ల‌డానికి వీల్లేద‌ని అమెరికా దౌత్యాధికారి రే టెల్లార్స‌న్ పేరు మీద ఓ ప్రకటన విడుదలైంది. అక్క‌డ ఇటీవ‌ల ఓటో వాంబియార్ అనే అమెరిక‌న్ పౌరుడి మ‌ర‌ణం త‌న‌ను క‌ల‌చివేసింద‌ని, అందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు రే టెల్లార్స‌న్ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. జూలై 27 నుంచి స‌రిగ్గా 30 రోజుల్లోగా ఉత్త‌ర కొరియాలో ఉండే అమెరిక‌న్లంతా స్వ‌దేశానికి రావాల‌ని, లేకపోతే వారి పాస్‌పోర్టుల‌ను పున‌రుద్ధరించేది లేద‌ని రే స్ప‌ష్టం చేశారు. అలాగే జూలై 27 త‌ర్వాత ఉత్త‌ర కొరియా వెళ్లే అమెరిక‌న్ల ర‌క్ష‌ణ‌తో త‌మ‌కు సంబంధం లేద‌ని రే ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించారు.