భారతీయులపై దాడి... అమెరికన్లు మృతి..
Published on: Tue Mar 21, 2017 3:05PM

అమెరికాలో జాత్యంహకార దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలుచోట్ల పలు దాడులు జరగగా.. తాజాగా మరోసారి కాల్పుల కలకలం రేగింది. అమెరికాలోని లూసియానాలో భారతీయులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. అయితే ఈ కాల్పుల్లో ఇద్దరు అమెరికన్లు మృతి చెందగా.. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంకా ఈ దాడికి పాల్పడినవారి కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


