TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికాలో పెరిగిపోతున్న‌ నిరుద్యోగం! 3.5 కోట్ల ఉద్యోగాలకు ముప్పు?

Published on: Fri Apr 24, 2020 10:18AM

ప్ర‌స్తుతం అమెరికాలో వేలాదిగా కంపెనీలు మూతపడుతుండడంతో.. లక్షలాది మంది నిరుద్యోగులుగా మారుతున్నారు. ఇప్పటికే 2 కోట్ల మందికి పైగా నిరుద్యోగుల జాబితాలో తమ పేరు నమోదు చేసుకోగా.. తాజాగా మరో 44 లక్షల మంది నిరుద్యోగ భృతి కోసం పేరు నమోదు చేసుకున్నారు. కరోనా విలయం మొదలైన తర్వాత ఇప్పటివరకు సుమారు 2.60 కోట్ల మంది నిరుద్యోగులుగా మారారు.

కరోనా వైరస్ కారణంగా అమెరికాలో అన్ని సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయి. దీంతో అక్కడ 3.5కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నారు. ప్రధానంగా హెచ్‌1బీ వీసాపై తాత్కాలికంగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కంపెనీలు ఆర్థికంగా కుంగిపోతుండటంతో తమ ఉద్యోగాలు ఉంటాయా? లేదా? అన్న సందేహం భారతీయుల్లో నెలకొంది.