Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అమెరికాలో ఇండియన్ మీద కాల్పులు
posted on: Dec 16, 2015 10:06AM

అమెరికాలో భారతీయుల మీద కాల్పులు జరగడం సర్వ సాధారణమైపోయింది. అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ఇది చాలా భయాన్ని కలిగిస్తోన్న అంశం. ఈ భయం నేపథ్యంలోనే అమెరికాలోని మరో భారతీయుడి మీద కాల్పులు జరిగాయి. బిచిగాన్‌లో ఇంద్రజిత్ సింగ్ అనే వ్యక్తికి చెందిన ఒక స్టోర్‌లో భారత సంతతికి చెందిన ఒక యువకుడు క్లర్క్‌గా పనిచేస్తున్నాడు. ఆ స్టోర్‌లోకి ఓ దుండగుడు మాస్క్ ధరించి ప్రవేశించాడు. డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. అయితే ఆ యువకుడు డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో దుండగుడు అతని మీద కాల్పులు జరిపి, డబ్బు తీసుకుని పరారయ్యాడు. అయితే అదృష్టవశాత్తూ బుల్లెట్లు ఆ యువకుడికి ప్రాణాపాయం కలిగించే ప్రాంతాల్లో తగలకపోవడంతో అతను బతికి బయటపడ్డాడు. ప్రస్తుతం అతనికి చికిత్స జరుగుతోంది.






