అమెరికాలో కాల్పుల కలకలం.. 5గురు మృతి.. నాలుగు నెలల గర్భిణి
Published on: Fri Mar 31, 2017 11:44AM

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఒకే వ్యక్తి పలుమార్లు కాల్పులకు తెగబడ్డాడు. వివరాల ప్రకారం.. అమెరికాలోని చికాగోలో సౌత్‌షోర్ ప్రాంతంలో ఉన్న రెస్టారెంట్ సమీపంలో ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతంరం.. అక్కడి సమీపంలోని ఓ ఇంట్లో కూడా కాల్పుల శబ్ధం వినిపించి.. అక్కడికి వెల్లి చూడగా.. నాలుగు నెలల గర్భిణి తలలో బులెట్ గాయంతో రక్తపు మడుగులో పడిపోయి ఉంది. ఇది చూసి షాకైన పోలీసులు తేరుకొని ఈ కాల్పులకు పాల్పడిన దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


