పాక్ ఉగ్రవాద స్థావరాలపై అమెరికా దాడులు..

 

పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని అగ్రరాజ్యమైన అమెరికా ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉంది. ఈ విషయంపై ఇప్పటికే అమెరికా, పాక్ కు అనేకసార్లు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. కానీ పాక్ మాత్రం అమెరికా హెచ్చరికాలు బేఖాతరు చేసుకుంటూనే వస్తుంది. దీంతో అమెరికా పాకిస్థాన్లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపింది. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న ఉగ్ర స్థావరాలపై డ్రోన్ సాయంతో డాడి చేసింది. ఈ దాడిలో హక్కానీ నెట్ వర్క్ కు చెందిన ఓ కమాండర్, ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబల్ ఏరియాలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్టు పక్కా సమాచారం అందడంతో, డ్రోన్ తో అమెరికా బలగాలు దాడి చేశాయి.