అమెరికా, ఇరాన్ మధ్య పీక్స్ కు ఉద్రిక్తతలు.. రణరంగంగా మిడిల్ఈస్ట్.!
Published on: Wed Jul 15, 2026 8:41AM

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కు చేరుకున్నాయి. పరస్పర వైమానిక, క్షిపణి దాడులతో మిడిల్ ఈస్ట్ రణరంగంగా మారింది. ఇరాన్ భూభాగంలోని సైనిక స్థావరాలు లక్ష్యంగా అమెరికా సైన్యం వైమానిక దాడులను తీవ్రతరం చేయగా, అందుకు ప్రతిగా కువైట్, బహ్రెయిన్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బలగాలు విరుచుకుపడ్డాయి.
హర్మూజ్ జలసంధి ద్వారా ప్రయాణించే అంతర్జాతీయ వాణిజ్య నౌకలను కాపాడేందుకే తాము ఇరాన్ మిలిటరీ సామర్థ్యాలపై దాడులు జరిపినట్లు అమెరికా రక్షణ విభాగం చెబుతోంది. అమెరికా దాడులకు దీటుగా.. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కువైట్ లోని అలీ అల్ సలేం సైనిక విమానాశ్రయంపై బాలిస్టిక్ క్షిపణి, 5 క్రూయిజ్ క్షిపణులు, 33 అత్యాధునిక డ్రోన్లతో దాడికి పాల్పడింది.
ఈ దాడిని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకున్నప్పటికీ.. కువైట్ నౌకాదళానికి చెందిన ఒక నౌక ధ్వం సం కాగా, నలుగురు జవాన్లు గాయపడ్డారు. అదే సమయంలో బహ్రెయిన్‌లోని అమెరికా ఐదో నౌకాదళ కమాండ్ కార్యాలయాలపై కూడా ఇరాన్ భారీ దాడులకు పాల్పడింది.
ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా హర్మూజ్ జలసంధి పరిసరాల్లోకి ఏకంగా 21 యుద్ధనౌకలను పంపి ఇరాన్ చుట్టూ బలమైన నౌకాదళ దిగ్బంధనాన్ని విధించింది. చర్చల ప్రక్రియకు ఇరాన్ సహకరించకపోతే ఆ దేశ విద్యుత్ వ్యవస్థలను, వంతెనలను నాశనం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. చమురు శుద్ధి కేంద్రాలపై దాడిని తమ చివరి అస్త్రంగా ఉపయోగిస్తామని కుండబద్దలు కొట్టారు.
అయితే ఎలాంటి పటిష్ట ప్రణాళిక లేకుండా అమెరికాను మరో చట్టవిరుద్ధ యుద్ధంలోకి ట్రంప్ నెడుతు న్నారంటూ అమెరికన్ సెనేటర్లు, డెమొక్రాట్ ప్రతినిధులు అగ్రరా జ్యాధినేతపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా ఏకపక్ష దాడులపై ఇరాన్ అధికారి కంగా ఫిర్యాదు చేసింది. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోకుంటే ఈ ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యం, చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం కనిపిస్తోంది.
West Asia Conflict, US Air Strikes on Iran, Iran Missile Attack Kuwait Bahrain, Donald Trump Iran Warning, Hormuz Strait Blockade


