మరోసారి అమెరికా జాత్యహంకారం... తెలుగు యువతిపై దాడి..
Published on: Mon Mar 6, 2017 11:49AM

అమెరికాలో భారతీయులపై నిరంతరం దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శ్రీనివాస్ కూచిభొట్ల, హర్నీష్ పటేల్, దీప్ రాయ్ లపై దాడులు జరిపి జాత్యంహకారాన్ని ప్రదర్శించగా.. ఇప్పుడు తాజాగా మరో తెలుగు యువతిపై దాడులకు పాల్పడ్డారు. తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన జ్యోతిపై ఓ నల్లజాతీయుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆమె చేతికి తీవ్ర గాయాలవ్వగా హుటాహుటీన ఆమెను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. దీంతో వరుస దాడుల వలన అమెరికాలో నివసిస్తున్న భారతీయులు ఆందోళన చెందుతున్నారు.


