అమెరికాకు అంత సీన్ లేదు.. ఎక్కడో నాలుగో స్థానం..
Published on: Fri Jan 22, 2016 9:35AM

ప్రపంచంలో అత్యంత అభివృద్ది చెందిన.. అత్యుత్తమ, గొప్ప దేశం ఏదంటే వెంటనే మనకు గుర్తొచ్చే పేరు అగ్రరాజ్యం అమెరికా. కానీ ఇప్పుడు అలా చెప్పాలంటే కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తాజాగా వచ్చిన జాబితాను చూస్తే అలానే అనిపిస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా.. వార్టన్ స్కూల్ అండ్ గ్లోబల్ బ్రాండ్ కన్సల్టెంట్లు ప్రపంచంలో అత్యుత్తమ దేశాల జాబితాను తయారు చేస్తూ ఉంటాయి. అలా వాళ్లు తాజాగా తయారు చేసిన జాబితా ప్రకారం అమెరికా అత్యుత్తమ దేశం కాదని తేలిపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అమెరికా స్థానాన్ని జర్మనీ ఆక్రమించింది. కనీసం జర్మనీ తరువాత స్థానంలో కూడా అమెరికా లేకపోవడం దురదృష్టకరం. ముందు ప్లేస్ లో జర్మనీ.. తరువాత కెనడా, బ్రిటన్.. ఆ తరువాత నాలుగో స్థానంలో అమెరికా నిలిచింది. మొత్తానికి అన్ని దేశాలపై పెత్తనం చెలాయిస్తున్న అగ్రరాజ్యమైన అమెరికాకు ఈ విషయం పెద్ద షాకింగ్ న్యూసే.


