వాళ్ళన్నిఅలా చూడాలనుందట...!
Published on: Sat Nov 16, 2013 11:52AM

అమీర్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం "ధూమ్3". ఈ చిత్ర టైటిల్ సాంగ్ విడుదల కార్యక్రమంలో అమీర్, హీరోయిన్ కత్రినా కైఫ్ లు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో అమీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. "సల్మాన్-కత్రినాలు నిజజీవితంలో ఒక్కటైతే చూడాలని కోరుకుంటున్నానని, కానీ నా ఆలోచనలు కష్టమే" అని అమీర్ అన్నాడు. ఆ సమయంలో కత్రినాకైఫ్ పక్కనే వుంది కానీ, ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
అసలే "సత్యమేవ జయతే" అంటూ ప్రజల యొక్క భాధలను తెలుసుకొని, వాటి పరిష్కారం గురించి ప్రయత్నాలు చేసిన అమీర్... తన హీరోయిన్ సమస్యను పరిష్కరించడానికే ఇలా మాట్లాడాడేమోనని అందరు అనుకుంటున్నారు. చూద్దాం.. ఈ విషయం ఎంతవరకి వెళ్తుందో. మరి దీనికి సల్మాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.


