TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ద్వారకా తిరుమలలో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం

Published on: Tue Nov 26, 2024 10:08AM

ఓ వైపు దేశ వ్యాప్తంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు జరుపుకుంటుంటే.. ఏపీలోని ద్వారకా తిరుమలలో గుర్తు తెలియని వ్యక్తులు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం అయిన ద్వారకా తిరుమలలోని పంచాయతీ పార్క్ లో ఉన్న అంబేడ్కర్ విగ్రహాన్ని సోమవారం రాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

దీనిపై ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని పోలీసులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ద్వారకా తిరుమలలో పోలీసులు భారీగా మోహరించారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.