కొనసాగుతున్న విగ్రహాల ధ్వంసం
Published on: Wed Feb 1, 2012 10:58AM
నిజా
మాబాద్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు అవమానం జరుగుతూనే ఉంది. మరో రెండో చోట్ల అంబెద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. ఓ చోట ఆయన విగ్రహానికి చెప్పుల దండ వేస్తే, మరో చోట గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని జలాల్‌పూర్ గ్రామంలోఅంబెద్కర్ విగ్రహానికి కొందరు చెప్పుల దండ వేశారు. ఈ ఘటనకు నిరసనగా దళిత సంఘాలు గ్రామంలో రాస్తారోకో నిర్వహించాయి.మరో పక్క తూర్పు గోదావరి జిల్లాలోని రావులపాలెం మండలం లక్ష్మీపోలవరం గ్రామంలో అంబెద్కర్ విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేశారు. విగ్రహం పాక్షికంగా ధ్వంసమైంది. దళిత సంఘాలు ధర్నాకు దిగాయి. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా ఇటీవల రాష్ట్రంలో అంబేడ్కర్ విగ్రహాల విధ్వంసం వరుసగా చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు నిరసనగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దళిత సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. నందిగామలో బంద్ పాటిస్తున్నారు.


