TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎందుకు రాష్ట్రపతి పాలన విధించకూడదన్న గాలి

Published on: Sun Jan 29, 2012 10:15AM

హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ విగ్రహాలకే రక్షణ కల్పించలేని ఈ దద్దమ్మ చేతగాని ప్రభుత్వం ఇక సామాన్య ప్రజలకేం రక్షణ కల్పిస్తుందని పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, అధికార ప్రతినిధి గాలి ముద్దుకృష్ణమ నాయుడు  ప్రశ్నించారు.దీనిపై ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాలపై దాడికి సంబంధించి ప్రభుత్వం చర్యలెందుకు తీసుకోలేదని నిలదీశారు. ఈ ఘటన ల్లో ప్రభుత్వమే దోషిగా కనిపిస్తోందన్న సందేహాన్ని ఆయన వ్యక్తం చేశారు. తాను సీఎంను అని చెప్పుకునేందుకు తప్ప శాంతిభద్రతలను కాపాడేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పనికి రావడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు విధించరాదని ఆయన ప్రశ్నించారు.