అంబ‌టి రాంబాబుకు మూడోసారి క‌రోనా.. భోగి వేడుక‌ల్లో ఆటాపాటా..

వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు క‌రోనా బారిన ప‌డ్డారు. జ‌లుబు, ఒళ్లు నొప్పులు ఉండ‌టంతో.. కొవిడ్ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వ‌చ్చింద‌ని అంబ‌టి సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తాను క్వారంటైన్‌కు వెళుతున్నాన‌ని.. త‌న‌ను క‌లిసిన వారు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించారు. వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబుకు క‌రోనా సోక‌డం ఇది మూడోసారి.

అయితే, అంబ‌టి రాంబాబు తీరుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఓవైపు ఏపీలో రోజుకు 5వేల వ‌ర‌కూ పాజిటివ్ కేసులు వ‌స్తున్నా.. ఈయ‌న మాత్రం భోగి నాడు మ‌హిళ‌ల‌తో ఆడిపాడారు. స‌త్త‌న‌ప‌ల్లి గాంధీ సెంట‌ర్ ద‌గ్గ‌ర‌.. భోగి మంట‌లు వేసి.. మాస్క్ లేకుండా.. లంబాడీల‌తో డ్యాన్స్ చేశారు అంబ‌టి రాంబాబు. అప్పుడే ఎమ్మెల్యే తీరుపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కొవిడ్ టైమ్‌లో ఇలా బ‌హిరంగ వేడుక‌లు.. మాస్కు లేకుండా.. మ‌హిళ‌ల‌తో ఆట‌లు ఏంట‌ని మండిప‌డ్డారు. 

భోగి వేడుక‌ల ప్రభావ‌మో ఏమో.. తాజాగా అంబ‌టి రాంబాబుకు క‌రోనా సోకింది. ఆయ‌న ఏదో పెద్ద ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుని బానే రిక‌వ‌ర్ అవుతారు.. కానీ ఆయ‌న్ను క‌లిసిన సామాన్యుల ప‌రిస్థితి ఏంటి? అంబ‌టితో డ్యాన్స్‌లు చేసిన ఆ లంబాడీలు ఇప్పుడు ఆందోళ‌న చెందుతున్నారు. ఆ వేడుక‌లో గుమ్మిగూడిన స‌త్తెన‌ప‌ల్లి వాసులు హ‌డ‌లి పోతున్నారు. అంబ‌టి.. ఎంత ప‌ని చేశావ‌య్యా అని తెగ ఇదైపోతున్నారు.