TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అంబటి రాంబాబు అరెస్టు

Published on: Sun Feb 1, 2026 7:29AM

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై అనుచిత వ్యాఖ్యలు, అసభ్య పదజాలంతో దూషించిన అంబటి రాంబాబుపై తెలుగుదేశం నాయకులు గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

ఆ తరువాత అంబటి క్షమాపణ చెప్పాలంటూ తెలుగుదేశం శ్రేణులు అంబటి నివాసాన్ని ముట్టడించాయి. ఈ నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పోలీసులు అంబటి రాంబాబును ఆయన నివాసంలో  శనివారం (జనవరి 31) అర్ధరాత్రి దాటిన తరువాత అదుపులోనికి తీసుకుని పోలీసు వాహనంలో నల్లపాడు పోలీసు స్టేషన్ కు తరలించారు.  

తిరుమల లడ్డూల్లో నెయ్యి కల్తీ జరిగిందంటూ టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదంపై స్పందిస్తూ అంబటి రాంబాబు ముఖ్యమంత్రిని ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నేతలు, కార్యకర్తలు గుంటూరులోని అంబటి నివాసం వద్దకు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. దాదాపు 6 గంటలకు పైగా నిరసన కొనసాగింది. ఈ క్రమంలో ఆయన ఇంటిపై రాళ్లు రువ్వడం, వాహనాలను ధ్వంసం చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బాజీ చౌదరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నల్లపాడు పోలీసులు అంబటిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.