అంబ‌టి ఇంట్లో రంగా ఫోటో ఎందుకు లేదు?

posted on: Feb 22, 2026 4:10PM

 

కూట‌మిలో అతి పెద్ద కాపు కుల అట్రాక్ష‌న్ ప‌వ‌న్. దాంతో స‌మాన‌మైన ఆక‌ర్ష‌ణ శ‌క్తి త‌మ పార్టీలో కూడా ఉందని ఐజాక్ న్యూట‌న్ లా క‌నుగొన్నారు జ‌గ‌న్. జ‌గ‌న్ ఆవిష్క‌రించిన‌ ఆ కాపుకుల టైగ‌ర్ పేరే అంబ‌టి రాంబాబు. ఎందుకంటే గ‌త ఎన్నిక‌ల్లో కాపు ఓటు బ్యాంకు మొత్తం  ప‌వ‌న్‌ని  చూసి అటు వైపున‌కు వెళ్లింద‌ని బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు జ‌గ‌న్. దీంతో త‌మ ద‌గ్గ‌రున్న అగ్ర‌శ్రేణి కాపు కుల‌నాయ‌కుడు అంబ‌టి. కాబ‌ట్టి ఆయ‌న‌కు ఎక్క‌డా లేని కాపు కుల ప్రాధాన్య‌త ఇస్తే మొత్తం స‌ర్దుకుంటుంది. అటు కాపులు ఇటు వ‌చ్చేస్తార‌న్న పిచ్చి భ్ర‌మ‌ల్లో బ‌తుకుతున్నారాయ‌న‌.

అందుకే కొంద‌రు వైసీపీ  నాయ‌కులు విశాఖ నుంచి గుంటూరుకు కాపుల ఐక్య‌త‌ను చాటి చెబుతూ ర్యాలీలు తీయ‌డం అయితేనేమి.. ఆపై రాంబాబు కుటుంబాన్ని  ప‌రామ‌ర్శించ‌డం అయితేనేమి  ఇవ‌న్నీ చ‌క‌చ‌క జ‌రిగిపోయాయి. ఇక మ‌రికొంద‌రు ఔత్సాహికులు అంబ‌టి ఫోటోను రంగా ఫోటోతో క‌లిపి కాపు కుల టైగ‌ర్ అంటూ జ‌గ‌న్ ఇచ్చిన బిరుదును వాడి భారీ ఎత్తున ఫ్లెక్సీలు పెట్టిన మాట  వాస్త‌వం. 

దీంతో చిర్రెత్తుకొచ్చిన నాగ‌బాబు.. మీకైనా బుద్ధి ఉండాలి? అలా చేయ‌మ‌న్న వాడికైనా బుద్ధుండాలి? అంబ‌టి రాంబాబుకూ కాపు కులానికీ ఉన్న సంబంధ‌మేంటి?  రంగాతో అంబ‌టిని పోల్చ‌డ‌మేంటి? అస‌లాయ‌న ఏనాడైనా కాపుల‌ను మాములుగా ప‌ల‌క‌రించారా?  పైపెచ్చు కాపులంటే తాగుబోతులు, తిరుగుబోతులు, మాంస ప్రియుల‌ని అవాకులు చ‌వాకులు పేలితే.. ఇప్పుడొచ్చి కాపు కులానికే పెద్ద పులి వంటి బిరుదులివ్వ‌డ‌మేంటి?  రంగాతో ఆ పోలిక‌లు తేవ‌డ‌మేంట‌ని ఎడా పెడా ఇచ్చి ప‌డేశారు నాగ‌బాబు. 

ఇదంతా ఇలా ఉంటే అంబ‌టి త‌న ముగ్గురు కూతుళ్ల‌కూ ముగ్గురు కాపేత‌ర సామాజిక వ‌ర్గ అల్లుళ్ల‌కిచ్చి పెళ్లి చేస్తే ఒక అల్లుడు అంబ‌టిలాంటి నీచుడ్ని తాను చూడ‌లేద‌ని తీవ్ర నిష్టూరాలాడ్డం గ‌త ఎన్నిక‌ల‌పుడు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా  ఉన్న అంద‌రూ చూశారు. ఇదిలా ఉంటే అంబ‌టి ఇంట్లో క‌నీసం  రంగా  ఫోటో ఉందా? అంటే  అదీ  ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. అలాంటి అంబ‌టి కాపు కులానికి ప్ర‌తీక ఎలా అవుతారు? అత‌డు కాపేత‌ర సామాజిక వ‌ర్గాల‌కు రాజ‌కీయ కాపు కాసే వాడు త‌ప్పించి.. నిజ‌మైన  కాపు కానే కాడ‌ని అంటారు ప‌లువురు కాపులు. అందుకు ఆయ‌నింట్లోని వైయ‌స్ ఫోటోలే ప్ర‌త్య‌క్ష‌ సాక్షి.. గా చెబుతారు వీరు. నిజంగా ఆయ‌నంత‌టి కాపు కుల వీరుడైతే రంగా ఫోటో ఎందుకు లేదో కూడా చెప్పాలంటారు కాపు సామాజిక వ‌ర్గం వారు.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...