అంబటికి చేదు అనుభవం?
Published on: Thu Jun 7, 2012 1:46PM
వై.కా.పా. నేత అంబటి రాంబాబుకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన అనంతపురం జిల్లాలోని రైల్వేకోడూరు నియోజకవర్గంలోని బొజ్జావారిపల్లెకు వెళ్లినప్పుడు ఈ చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది. వై.కా.పా.లోకి చేరతామన్న కార్యకర్తలను చేర్చుకునేందుకు అంబటి రాంబాబు ఈ గ్రామానికి వచ్చారు. ఆయనకు సహాయాకునిగా మాజీ ఎమ్మెల్యే కొరమట్ల వచ్చారు. వీరిద్దరూ వచ్చారని తెలుసుకున్న కొందరు వై.కా.పా. లో చేరారు. ఈ చేరిక జరిగిన ఇంటి బయట కాంగ్రెస్ కార్యకర్త్జలుగుంపులు గుంపులుగా చేరారు. ఇదేమిటీ అని అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే ఆశ్చర్యపోయే లోపే వారు అంబటి తదితరులను ముట్టడించటానికి సన్నద్ధమయ్యారు. దీంతో వారు ప్రధాన రహదారిని వదిలేసి గత్యంతర లేని స్థితిలో వీరిని కొత్త కార్యకర్తలు దొంగాదారిన తప్పించారు. కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో జరిగిన ఈ చేదు అనుభవాన్ని అంబటి మొత్తం మీద దిగమింగారు. అయితే విషయం మాత్రం వెలుగులోకి వచ్చేసింది. రాజకీయంలో ఇదంతా సహజమని అంబటి సరిపెట్టుకుంటారో? కాంగ్రెస్ కార్యకర్తలపై కసి పెంచుకుంటారో? అర్థం కావటం లేదని ఆ పార్టీ నేతలంటున్నారు.


