TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఓజీపై అంబటి యూటర్న్

Published on: Fri Sep 26, 2025 3:11PM

ఒకే మాట మీద నిలబడటం అన్నది వైసీపీ ఎకో సిస్టమ్ లో లేనే లేదు. నిన్న ఔనన్నది కాదనడం.. కాదన్నది ఔనన్నడం ఆ పార్టీలో మామూలే. ఆ పార్టీ అధినేత జగన్ నుంచి నేతలు, శ్రేణుల వరకూ ఇదే పరిస్థితి ఉంటుంది. అందుకు రాజకీయాలే కాదు, కులం, మతం, వర్గం ఇలా ఏదీ మినహాయింపు కాదు. తాజాగా సినీమాలు కూడా మినహాయింపు కాదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు రుజువు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన ఓజీ సినీమా తాజాగా విడుదలైంది.

విడుదల కు ముందు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఓజీపై, పవన్ కల్యాణ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అయితే గంటల వ్యవధిలోనే మళ్లీ యూటర్న తీసుకుని యథాప్రకారంగా పవన్ పై విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా ఆయన నటించిన సినీమానూ విమర్శించారు. అంబటి వ్యాఖ్యలు ఇప్పుడు సీనీ, రాజకీయవర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి.  

ఇంతకీ ఏం జరిగిందంటే..ఓజీ సినీమా విడుదలకు ముందు అంబటి రాంబాబు ఓ వీడియో సందేశం విడుదల చేస్తూ.. పవన్ కల్యాణ్ ఈ సినిమాను కసిగా చేశారనీ, బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమనీ పేర్కొన్నారు. అయితే గంటల వ్యవధిలోనే మాట మార్చారు. ఆ మేరకు ఓ ట్వీట్ చేస్తూ పవన్ సినిమా సక్సెస్ కావాలన్నది తన ఆరాటమే కానీ ఫలితం మాత్రం శూన్యం అంటూ పేర్కొన్నారు. దీనిపై జనసైనికులు, పవన్ అభిమానులూ మండి పడుతున్నారు.  సోషల్ మీడియా వేదికగా అంబటిపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. అంబటి కపటత్వానికి ఇది నిదర్శనమంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తంగా మాట మార్చడంలో వైసీపీ ఆనవాయితీని అంబటి మరోసారి రుజువు చేశారని అంటున్నారు.