TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలకు అమరావతి మహిళా రైతుల కృతజ్ఞతా పాదయాత్ర

Published on: Tue Jun 25, 2024 12:06PM

అమరావతి రైతుల పోరాటం ఫలించింది... ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరింది.. ఆ ఏడుకొండల వాడి ఆశీస్సులు లభించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రాక్షస పాలన ముగిసింది.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. అమరావతి అద్భుత రాజధానిగా రూపొందడానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి మహిళా రైతులు అటు ఏడుకొండల వాడికి, ఇటు చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అమరావతి నుంచి తిరుమలకు కృతజ్ఞతా పాదయాత్ర చేపట్టారు. గోవిందనామ స్మరణతో పాదయాత్ర జరుగుతోంది.