అమరావతి ఉద్యమాలకు కరోనా అడ్డుపడుతోందా...

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ   చూసినా  కరోనా పైనే చర్చ జరుగుతోంది...ఏ ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నా కరోనా నే...బస్సులు, రైళ్లు, సినిమాలు అన్నీ బంద్ అయిపోతున్నాయి...ఇక రాష్ట్ర ప్రభుత్వాలు అయితే  ఛకా చకా ఏర్పాట్లు చేసుకుంటున్నాయి......మనుషులు గుమిగూడి ఉండకూడదదు అనే చర్చ జరుగుతోంది...దీంతో అమరావతిలో గత కొన్ని రో్జులుగా  జరుగుతున్న ఆందోళనలకు కరో్నా ఎఫెక్ట్ ఉండదా అనే చర్చ జరుగుతోంది...కరోనా  వల్ల  అందరూ ఒక చోట  గుమి గూడి ఉంటే  నష్టం జరుగుతంది అని ఏపీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.దీంతో అమరావతి  ప్రాంతంలో జరిగే ఉద్యమాలపై కరోనా ప్రభావం ఎంత వరకు ఉంటుంది అనే చర్చ మొదలయింది..

  అమరావత రాజధాని ఉద్యమాలలో  రోజూ పదుల సంఖ్యలో జనం ఒకే చోట ఉంటున్నారు..దీక్షలు ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు..దీంతో ఇప్పుడు శాంతి భద్రతల సమస్యకన్నా కరోనా సమస్య తీవ్రం అవుతోంది..వీరిలో   పొరపాటున విదేశాల నుంచి వచ్చిన  వారు ఉంటే మరింత ఎక్కువగా  నష్టం జరుగుతుంది అనే అభిప్రాయాలు వ్యక్తం అవుుతున్నాయి....ఎలాంటి ఆందోళనలు చేయకుండా ఉండేనే  మంచిదని అధికారులు సైతం చెబుతున్నారు..అనవసరంగా  ఆనారోగ్యం కొని తెచ్చుకోవడం అవుతుందనే సంకేతాలు కూడా వెళుతున్నాయి......దీంతో  కరోనా ఎపెక్ష్  అమరావతి ఉద్యమంపై తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుుతున్నాయి..?ఒక  వేళ నిరసనలు, ఆందోళనలు జరుపుకోవాలనుకుంటే కరోనా తీవ్రత తగ్గిన తర్వాత  చేసుకుంటే మంచిదనే అభిప్రాయాలు కూడా  వ్యక్తం అవుతున్నాయి...