AmaravatI.. AI సిటీ..!
Published on: Thu Aug 29, 2024 5:34PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సిటీగా తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతి అభివృద్ధి అంశం మీద అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఏఐ, అమరావతి’ని కలిపి ఇంగ్లీషులో లోగో రూపొందించాలని సూచించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, నాణ్యతలో ఎక్కడా రాజీపడకుండా లోగో రూపొందించాలని ఆదేశించారు. 90 రోజుల్లో సీఆర్‌డిఏ కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని చంద్రబాబు సూచించారు. అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.


