TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమరావతి నిర్మాణానికి 17.05 ఎకరాల భూమిని అందజేసిన రైతు..!

Published on: Thu Jul 16, 2026 5:44PM

 

ప్రజా రాజధాని నిర్మాణానికి రాయపూడి రైతు  కుటుంబం ఉదారత.. !

ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో అనుమోలు వెంకట నాగవర్ధన సాయి బిపిన్ కుమార్ వారి కుటుంబ సభ్యులు ల్యాండ్ పూలింగ్ పథకం కింద తమ భూములను స్వచ్ఛందంగా అందజేసేందుకు ముందుకు వచ్చారు.

రాయపూడి గ్రామ పరిధిలో తమ కుటుంబానికి చెందిన 17.05 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణ అవసరాల కోసం ఏపీ సీఆర్‌డీఏకు అందజేసేందుకు తమ సమ్మతిని తెలియజేస్తూ సంబంధిత అంగీకార పత్రాలను కాంపిటెంట్ అథారిటీ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.ఎస్. భాగ్యరేఖకి అందజేశారు.

ఏపీ సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్ ఏ. భార్గవతేజ, ఐఏఎస్ సమక్షంలో రాయపూడిలోని ఏపీ సీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయంలో గురువారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రైతు సాయి బిపిన్ కుమార్ వారి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు. రాజధాని గ్రామాల ప్రజలు కూడా ల్యాండ్ పూలింగ్ ప్రక్రియకు ఏపీ సీఆర్‌డీఏ అధికారులకు సహకరించాలని వారు కోరారు.

Amaravati, Amaravati Capital Construction, APCRDA, Land Pooling Scheme, Land Pooling, Land Acquisition, Rayapudi Farmers, 17.05 Acres of Land, APCRDA Officials